తెలంగాణ ప్రేమకథ ‘మోతెవరి లవ్‌స్టోరీ’

తెలంగాణ ప్రేమకథ ‘మోతెవరి లవ్‌స్టోరీ’

గ్రామీణ తెలంగాణ నేపథ్యంతో కూడిన వెబ్‌ సిరీస్‌ ‘మోతెవరి లవ్‌స్టోరీ’. అనిల్‌ గీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రధారులు. శివకృష్ణ బుర్రా దర్శకుడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ తెలుగులో వచ్చే నెల 8 నుండి ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన నటుడు, దర్శకుడు తరుణ్‌భాస్కర్‌ ట్రైలర్‌ను ఆవిష్కరించి మేకర్స్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరినీ ఆకట్టుకునేలా ‘మోతెవరి లవ్‌స్టోరీ’ని రూపొందించామని, ఆడియన్స్‌ని నవ్వించేలా, మెప్పించేలా సిరీస్‌ ఉంటుందని, నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని దర్శకుడు శివకృష్ణ బుర్రా తెలిపారు. ఇంకా నిర్మాత శ్రీరామ్‌ శ్రీకాంత్‌, జీ5 సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌, డీఓపీ శ్రీకాంత్‌ అరుపుల, హీరోహీరోయిన్లు అనిల్‌ గీలా, వర్షణిలతో పాటు మరో అతిధి మధుర శ్రీధర్‌ కూడా మాట్లాడారు.

editor

Related Articles