తమిళ సినిమా ‘డా డా’ తెలుగులో ‘పా పా’ పేరుతో…

తమిళ సినిమా ‘డా డా’ తెలుగులో ‘పా పా’ పేరుతో…

కవిన్‌, అపర్ణాదాస్‌ జంటగా నటించిన తమిళ హిట్‌ సినిమా ‘డా డా’ తెలుగులో ‘పా పా’ పేరుతో వస్తోంది. గణేష్‌ కె బాబు దర్శకుడు. జేకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మాత నీరజ కోట తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ నెల 13న విడుదల కానుంది. మంగళవారం ట్రైలర్‌ను ప్రముఖ దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి, బి.గోపాల్‌ ఆవిష్కరించారు. మనం ఎంత ఆధునికంగా జీవిస్తున్నా మానవీయ విలువలు, భావోద్వేగాలు మాత్రం ఎప్పటికీ మారవనే చక్కటి సందేశం మేళవించిన కథాంశమిదని, తప్పకుండా తెలుగు ప్రేక్షకుల్ని కూడా మెప్పిస్తుందని నిర్మాత నీరజ కోట తెలిపారు. భాగ్యరాజ, వీటీవీ గణేష్‌, ఐశ్వర్య తదితరులు నటించిన ఈ సినిమాకి సంగీతం: జెన్‌మార్టిన్‌, దర్శకత్వం: గణేష్‌ కె బాబు.

editor

Related Articles