తమిళ  దర్శకుడు వేలు ప్రభాకరన్ మృతి

తమిళ  దర్శకుడు వేలు ప్రభాకరన్ మృతి

త‌మిళ ఇండ‌స్ట్రీలో విషాదం నెల‌కొంది. తమిళ చిత్ర నిర్మాత, దర్శకుడు వేలు ప్రభాకరన్ (68) కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న‌ చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే శుక్రవారం తెల్లవారుజామున అక‌స్మాతుగా గుండెపోటు రావ‌డంతో ఆసుప‌త్రిలోనే తుది శ్వాస విడిచారు. వేలు ప్రభాకరన్ మరణం తమిళ సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం పోరూరు స్మశానవాటికలో అంత్యక్రియలు జరుగుతాయి.

editor

Related Articles