మహా శివరాత్రి గిఫ్ట్: నిఖిల్ ‘స్వయంభు’ కొత్త పోస్టర్ ఔట్

మహా శివరాత్రి గిఫ్ట్: నిఖిల్ ‘స్వయంభు’ కొత్త పోస్టర్ ఔట్

పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కార్తికేయ-2’తో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన నిఖిల్, ఇప్పుడు తన ప్రతిష్టాత్మక 20వ చిత్రం ‘స్వయంభు’తో  ప్రేక్షకులను ఆకర్షించబోతున్నాడు. భారీ స్థాయిలో నిర్మించబడిన ఈ హిస్టారికల్ యాక్షన్ ఎపిక్ కి భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మించారు. ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. టాప్ క్లాస్ నిర్మాణ విలువలు, పవర్ ఫుల్ పాన్-ఇండియా విజన్ తో వస్తున్న స్వయంభు నిఖిల్ అత్యంత ప్రతిష్టాత్మక వెంచర్లలో ఒకటిగా నిలుస్తుంది. తాజాగా మేకర్స్ భారీ అప్‌డేట్‌ను అనౌన్స్ చేశారు. రెండు సంవత్సరాల ప్రయాణం,170 రోజుల ఇంటెన్స్ షూటింగ్ తర్వాత ఈ మహత్తర చిత్రీకరణ పూర్తి చేసిందని టీం గర్వంగా ప్రకటించింది. భారతదేశపు వైభవమైన చరిత్రను, మహోన్నతతను సెలబ్రేట్ చేస్తూ రూపొందుతున్న ‘స్వయంభు’ చిత్రం ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి 13, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.చిత్రం మీద పనిచేయడం సవాలుతో కూడుకున్నా అద్భుతమైన అనుభవం అని వీడియో షేర్ చేశారు నిఖిల్. ”ఒక్క సినిమా.. రెండు సంవత్సరాల కష్టం.. పదుల సంఖ్యలో సెట్లు. వేల సవాళ్లు.. అదొక సామ్రాజ్యం. లక్షల మంది ప్రేక్షకులు. కోట్ల పెట్టుబడి..

editor

Related Articles