తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటులలో హీరో సూర్య ఒకరు. ఆయన నటించిన ప్రతి సినిమా ఇక్కడ కూడా వస్తోంది. అంతేకాదు, వైవిధ్యానికి పెద్దపీట వేస్తూ ఆసక్తికర సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తారు. ఇప్పటికే తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేస్తున్న సూర్య తమిళ కమెడియన్ ఆర్జే బాలాజీ దర్శకత్వంలో కరుప్పు అనే సినిమా చేస్తున్నాడు. నేడు సూర్య బర్త్‌డే కావడంతో సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘నా పేరు సూర్య.. నాకు ఇంకోపేరు కూడా ఉంది’, ‘ఇది మన టైమ్’ అంటూ సూర్య తన వింటేజ్‌లుక్‌లో అదరగొడుతున్నాడు. జై భీమ్ తర్వాత మళ్లీ ఈ సినిమాలో సూర్య మరోసారి న్యాయవాది పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.

- July 23, 2025
0
64
Less than a minute
Tags:
You can share this post!
editor