తమిళ హీరో సూర్య తన కొత్త సినిమా షూటింగ్‌ను ప్రారంభించాడు. రెట్రో సినిమాతో ఇటీవల ప్రేక్షకులను అలరించిన సూర్య తన తదుపరి సినిమా వెంకీ అట్లూరితో చేస్తున్న విషయం తెలిసిందే. ‘సూర్య 46 అంటూ రాబోతున్న ఈ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఇటీవలే పళని మురుగన్‌ని దర్శించుకున్న ఈ చిత్రబృందం తాజాగా ఈ సినిమా షూటింగ్‌ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను షేర్ చేసింది. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్నారు. అంతేకాకుండా, రవీనా టాండన్, రాధిక కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
- June 11, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor

