అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ నటుడు దర్శన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ కేసులో నటుడికి బెయిల్ ఇచ్చేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. గతేడాది డిసెంబర్‌లో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును సుప్రీం ధర్మాసనం పక్కనపెట్టింది. ఈ మేరకు జస్టిస్ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దర్శన్‌కు బెయిల్ ఇచ్చేందుకు ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని పేర్కొంది. బెయిల్ మంజూరు చేయడం విచారణపై ప్రభావం చూపుతుందని పేర్కొంది. నిందితులు ఎంతటి వాళ్లైనా చట్టానికి తల వంచాల్సిందే అని వ్యాఖ్యానించింది. కస్టడీలో దర్శన్‌కు ఎలాంటి ప్రత్యేక ట్రీట్‌మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదని జైలు అధికారులకు సూచించింది. అంతేకాదు దర్శన్‌ను త్వరగా అదుపులోకి తీసుకోవాలని ఆదేశించింది.

- August 14, 2025
0
68
Less than a minute
Tags:
You can share this post!
editor