ప్ర‌త్యేక ప్రీమియ‌ర్‌ను చూసిన ‘సితారే జమీన్ పర్’ సినిమాపై సుధామూర్తి ప్ర‌శంస‌లు

ప్ర‌త్యేక ప్రీమియ‌ర్‌ను చూసిన ‘సితారే జమీన్ పర్’ సినిమాపై సుధామూర్తి ప్ర‌శంస‌లు

ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్, ప్రముఖ రచయిత్రి, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సుధామూర్తి బాలీవుడ్ న‌టుడు అమీర్‌ఖాన్ న‌టించిన ‘సితారే జమీన్ పర్’ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఈ సినిమా తన ఆలోచనలను మార్చేసిందని, ఇది తప్పకుండా చూడాల్సిన సినిమా అని ఆమె చెప్పుకొచ్చారు. బాలీవుడ్ హీరో అమీర్‌ఖాన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న‌ తాజా సినిమా ‘సితారే జమీన్ పర్‌’. ‘సబ్‌ కా అప్న అప్న నార్మల్‌’ అనేది ఉపశీర్షిక. ఆర్‌ఎస్‌ ప్రసన్న దర్శకత్వం వహిస్తున్న‌ ఈ సినిమాలో జెనీలియా హీరోయిన్‌గా నటిస్తున్నారు. అమీర్‌ఖాన్  ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అమీర్‌ఖాన్, అపర్ణ పురోహిత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ప‌లువురు సినీ ప్ర‌ముఖ‌ల‌తో పాటు రాజ‌కీయ నాయ‌కుల కోసం ప్ర‌త్యేక ప్రీమియ‌ర్‌ను ప్రద‌ర్శించారు మేక‌ర్స్. ఈ ప్రీమియ‌ర్‌లో ప్రముఖ రచయిత్రి, రాజ్య‌స‌భ స‌భ్యురాలు సుధామూర్తి కూడా పాల్గొన్నారు. అయితే ఈ సినిమా చూసిన అనంత‌రం సుధామూర్తి భావోద్వేగానికి లోన‌య్యారు.

editor

Related Articles