Movie Muzz

అమ్మవారి మహిమలు తెరపై…?

అమ్మవారి మహిమలు తెరపై…?

సుబ్బు, ప్రియాంక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న డివోషనల్ మూవీ ‘దక్షిణ కాళీ’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ అర్చన అమ్మవారి పాత్రలో దర్శనమివ్వడం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. శ్రీనిధి క్రియేషన్స్ బ్యానర్‌పై సత్యవాణి మీసాల ఈ సినిమాకు కథను అందించి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు తోట కృష్ణ అమ్మవారి మహిమలను ప్రతిబింబించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సినిమా సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు తోట కృష్ణ మాట్లాడుతూ, అమ్మవారి మహిమలు తెలియజేసేలా దక్షిణ కాళీ చిత్రాన్ని రూపొందించామని, డిస్ట్రిబ్యూటర్లకు షోలు వేసినప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోందని తెలిపారు. నిర్మాత సత్యవాణి మీసాల ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారని ప్రశంసించారు. ఈ ప్రెస్ మీట్‌లో నిర్మాత సత్యవాణి మీసాల, హీరోయిన్ ప్రియాంక, నటుడు అఫ్సర్ ఆజాద్, హీరో సుబ్బు పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే డివోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘దక్షిణ కాళీ’ నిలవనుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

Related Articles