బాలకృష్ణ‌తో సినిమాపై స్పందించిన‌ శ్రీనువైట్ల..!

బాలకృష్ణ‌తో సినిమాపై స్పందించిన‌ శ్రీనువైట్ల..!

టాలీవుడ్ ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్టర్  శ్రీనువైట్ల ప్ర‌స్తుతం హిట్లు లేక స‌త‌మ‌వుతున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ‘విశ్వం’ (గోపీచంద్‌)తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన అత‌డు ఆశించిన విజ‌యాన్ని అందుకోలేక పోయాడు. దీంతో ఎలాగైన హిట్ కొట్టాల‌నే క‌సితో ఉన్నాడు. అయితే చిరంజీవి, నాగార్జున‌, వెంక‌టేష్‌ల‌తో సినిమాలకు డైరెక్షన్  చేసిన శ్రీనువైట్ల బాలకృష్ణ‌తో సినిమాను తెర‌కెక్కించ‌లేద‌న్న విష‌యం తెలిసిందే. తాజాగా బాల‌య్య‌తో సినిమా ఉంటుందా లేదా అనే విష‌యంపై మీడియా అత‌డిని అడగ్గా.. శ్రీనువైట్ల మాట్లాడుతూ.. బాల‌కృష్ణ అంటే త‌న‌కు చాలా అభిమానమని అత‌డు నటించిన ‘ప్రాణానికి ప్రాణం’ సినిమాతోనే త‌న కెరీర్ మొద‌ల‌య్యిందని తెలిపాడు. అయితే బాల‌య్య‌తో సినిమా చేయాల్సి ఉన్నా అనుకోని కార‌ణాల వ‌ల‌న అది ముందుకు పోలేద‌ని.. ఫ్యూచ‌ర్‌లో అయినా బాల‌కృష్ణ‌తో త‌ప్ప‌కుండా సినిమా చేస్తాన‌ని తెలిపాడు శ్రీనువైట్ల.

editor

Related Articles