‘వార్ 2’ నుండి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్

‘వార్ 2’ నుండి స్పెష‌ల్ సాంగ్ రిలీజ్

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా సినిమా ‘వార్ 2’. య‌ష్‌రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య‌చోప్రా ఈ సినిమాను నిర్మిస్తుండ‌గా.. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేస్తోంది చిత్ర‌యూనిట్. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్‌డేట్‌ను షేర్ చేశారు మేక‌ర్స్. ఈ సినిమాలో హృతిక్ రోష‌న్, ఎన్టీఆర్ క‌లిసి డ్యాన్స్ చేసిన స‌లామ్ అనాలి  అనే పాట ప్రోమోను విడుద‌ల చేశారు మేక‌ర్స్. దూనియా స‌లామ్ అనాలి అంటూ సాగిన ఈ పాట ప్ర‌స్తుతం శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట ఫుల్ వీడియోను థియేట‌ర్‌లోనే చూడాలి అంటూ మేక‌ర్స్ చెబుతున్నారు.

editor

Related Articles