తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో తన నటనతో పాటు స్టైలిష్ ఫ్యాషన్ సెన్సేషన్‌గా నిలిచిన అందాల తార సమంత తాజాగా కొత్త లగ్జరీ వాచ్ ధరించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఇటీవల సమంత సినిమాల కన్నా కూడా బ్రాండ్లని ప్రమోట్ చేస్తూ ఎక్కువగా వార్తలలో నిలుస్తోంది. తాజాగా ఒక లగ్జరీ వాచ్‌ను ధరించిన సామ్ అందుకు సంబంధించిన ఫొటోలను ఫేర్ చేయగా, ఇవి నెటిజన్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే సమంత ధరించిన ఆ వాచ్ అందరి దృష్టిని ఆకర్షించగా, అది ఏ కంపెనీది..? దాని ధర ఎంత ? అంటూ గూగుల్‌లో ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సమంత ధరించిన వాచ్ ట్రాపేజ్డ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జువెలరీ వాచ్ కాగా, దీని రేటు సుమారు రూ.30 లక్షలకు పైగా ఉంటుందని తెలుస్తోంది.
- September 25, 2025
0
152
Less than a minute
You can share this post!
administrator


