డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వెర్సటైల్ నటుడు విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘స్లమ్ డాగ్’ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను వేగంగా జరుపుకుంటోంది. ‘33 టెంపుల్ రోడ్’ అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
తాజాగా చిత్రబృందం టీజర్ విడుదల తేదీని ప్రకటించింది. జూన్ 8న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. విడుదల చేసిన పోస్టర్‌లో డార్క్ అండ్ ఇంటెన్స్ విజువల్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్త నటిస్తుండగా, టబు, దునియా విజయ్, బ్రహ్మాజీ, వీటీవీ గణేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
జాతీయ అవార్డు విజేత హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

