విజయ్ సేతుపతి, నిత్యామీనన్ జంటగా నటిస్తున్న ఫ్యామిలీ డ్రామా ‘సార్ మేడమ్’ ఎ రగ్గ్‌డ్ లవ్‌స్టోరీ-8 ఉపశీర్షిక. పాండిరాజ్ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. నీతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందోనని సెకండ్ థాట్ లేకుండా నేనే కావాలని వచ్చేశాను. మా అమ్మానాన్నే నన్ను ఇలా చూసుకోలేదని వాళ్లనే తిట్టుకునే విధంగా నిన్ను చూసుకుంటా అంటూ విజయ్ సేతుపతితో మాట్లాడిన డైలాగ్స్‌తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. దంపతుల మధ్య వచ్చే గొడవలు హాస్యాన్ని పండించాయి. ‘మా ఇద్దరినీ విడదీయండి’ అంటూ నిత్యామీనన్ చెప్పిన డైలాగ్‌తో కథ అనూహ్య మలుపు తీసుకోవడం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. చక్కటి హాస్యం, భావోద్వేగాలతో సాగే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: సంతోష్ నారాయణన్, నిర్మాతలు: సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్.

- July 18, 2025
0
146
Less than a minute
Tags:
You can share this post!
editor