సినీ గాయని చిన్మయి శ్రీపాద మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్ బారిన పడింది. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని ఆమె హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్లింది. చిన్మయి చేసిన ఫిర్యాదు ప్రకారం… సోషల్ మీడియాలో కొంతమంది వ్యక్తులు చాటింగ్ ద్వారా తనను ఉద్దేశిస్తూ రాయడానికి వీలులేని అసభ్యకరమైన పదాలతో వేధిస్తున్నారు. తాను సాధారణంగా ట్రోలింగ్‌ను పట్టించుకోనప్పటికీ, ఈసారి ట్రోలర్స్ తన పిల్లలను కూడా ట్రోలింగ్‌లోకి లాగి, వారు చనిపోవాలని కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ముఖ్యంగా, ‘మంగళసూత్రం’ ధరించడం గురించి తన భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ ఇటీవల చేసిన కామెంట్స్‌పై ఒక యువకుడు అసభ్యంగా ట్రోల్ చేయడాన్ని చిన్మయి పోలీసుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే చిన్మయి ఫిర్యాదుపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ తక్షణమే స్పందించారు. ఈ విషయంపై వెంటనే స్పందించాలంటూ సైబర్ క్రైమ్ పోలీసులతో పాటు హైదారాబాద్ పోలీసులను ఆదేశించారు.
- November 6, 2025
0
35
Less than a minute
You can share this post!
editor

