పవన్‌‌కళ్యాణ్ సినిమా ‘ఓజీ’లో శింబు పాట

పవన్‌‌కళ్యాణ్ సినిమా ‘ఓజీ’లో  శింబు పాట

తమిళ హీరో శింబుకి పాటలు పాడటంలో కూడా ప్రాక్టీస్ ఉంది. తమిళ, తెలుగు భాషల్లో ఆయన ఇప్పటికే తనదైన శైలిలో సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన పవన్‌కళ్యాణ్‌ ‘ఓజీ’ సినిమాలో ఓ పాట పాడారు. ఈ విషయాన్ని చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఓజీ’ సినిమాలో శింబు పాట పాడనున్నారని గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా తమన్‌ ప్రకటనతో అది నిజమని రుజువైంది. ‘ఫైర్‌ స్ట్రామ్‌’ పేరుతో కంపోజ్‌ చేసిన ఈ పాటకు శింబు వాయిస్‌ హైలెట్‌గా నిలుస్తుందని మేకర్స్‌ తెలిపారు. ‘ఓజీ’ సినిమా షూటింగ్‌ పునఃప్రారంభమైన తర్వాత ఈ పాటను విడుదల చేస్తామని మేకర్స్‌ తెలిపారు. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్‌ మోహన్‌, ఇమ్రాన్‌ హష్మీ, అర్జున్‌దాస్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ఇంకా కొంతభాగం చిత్రీకరణ మిగిలి వుంది. రాజకీయ కార్యకలాపాలకు కాస్త గేప్ ఇచ్చి త్వరలో ఈ సినిమా షూటింగ్‌లో పవన్‌కళ్యాణ్‌ పాల్గొనే అవకాశాలున్నాయని తెలిసింది.

editor

Related Articles