ఆ సినిమా కోసం 10 డేస్‌లో 10 కిలోల వెయిట్ త‌గ్గిన శింబు

ఆ సినిమా కోసం 10 డేస్‌లో 10 కిలోల వెయిట్ త‌గ్గిన శింబు

 తమిళ సినీ పరిశ్రమలో త‌న టాలెంట్‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్న నటుడు శింబు. కొన్నేళ్ల క్రితం వరకూ వ్యక్తిగత వివాదాలతో, కెరీర్‌లో అంత‌గా ఎద‌గ‌లేక‌పోయాడు. ఇప్పుడు మాత్రం త‌న దృష్టి అంతా సినిమాల‌పై ఉంచుతూ చాలా డెడికేష‌న్‌తో వైవిధ్య‌మైన సినిమాలు చేస్తున్నాడు. తాజాగా శింబు, పేరున్న దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు. గతంలో ధనుష్‌తో కలిసి వడ చెన్నై వంటి కల్ట్ క్లాసిక్‌ను తెరకెక్కించిన వెట్రిమారన్, అదే బ్యాక్‌డ్రాప్‌తో శింబు కోసం కొత్త కథను సిద్ధం చేశాడు. ఈ సినిమా కోసం వెట్రిమారన్, వడ చెన్నై రైట్స్‌ను కూడా ధనుష్ నుండి అధికారికంగా తీసుకున్నట్లు సమాచారం. ఇందులో ఆసక్తికర అంశం ఏంటంటే, ఈ సినిమాలోని పాత్ర కోసం శింబు కేవలం 10 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గాడు! ఇప్పటికే ‘థగ్ లైఫ్’లో నాజూకు లుక్‌లో కనిపించిన శింబు, ఇప్పుడు వెట్రిమార‌న్ సినిమాలో మ‌రింత బ‌క్క‌గా క‌నిపించ‌నున్నాడ‌ట‌. పాత్ర డిమాండ్ చేయ‌డంతో శింబు క‌ష్ట‌ప‌డి బ‌రువు త‌గ్గాడు. శింబు బరువు సినిమాలోని పాత్రల కోసం తరచుగా మారుతూనే ఉంటుంది. కొన్ని పాత్రల కోసం బరువు పెరిగితే, మరికొన్నింటి కోసం బరువు తగ్గుతాడు. ఉదాహరణకు, ‘మానాడు’ సినిమా కోసం దాదాపు 30 కేజీల బరువు తగ్గాడు. మరొక సినిమా కోసం 13 కేజీలు తగ్గిన‌ట్టు స‌మాచారం.. అయితే, కొన్ని పాత్రల కోసం బరువు పెరిగే అవసరం కూడా ఉంటుంది, ఉదాహరణకు, ‘అన్బానవన్ అసరాదవన్ అడంగదవన్’ సినిమాలో ఒక వృద్ధుడి పాత్ర కోసం బరువు పెరిగారు. ఇప్పుడు వెట్రిమార‌న్ సినిమా కోసం ఏకంగా 10 కేజీల బ‌రువు త‌గ్గాడు. చిత్రంలో శింబు పాత్ర అత్యంత నేచుర‌ల్‌గా ఉంటుంద‌ట‌. ఇంతకుముందు ‘వడ చెన్నై 2’ ధనుష్‌తో చేయాల‌ని భావించిన‌ వెట్రిమారన్, అది కుదరకపోవడంతో కొత్త కథను తీసుకుని, శింబుతో సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఇందులో మరో విశేషం ఏంటంటే, ‘జైలర్’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే రానుండగా, సెట్స్‌పైకి ఈ నెలాఖరులోపే వెళ్లే అవకాశం ఉంది. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.

editor

Related Articles