రెస్టారెంట్‌ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి

రెస్టారెంట్‌ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టి తన రెస్టారెంట్‌ను మూసివేస్తున్నట్లు ప్రకటించి అందరికీ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకు గల కారణాలను నటి తాజాగా వెల్లడించారు. 2016లో బాంద్రా ప్రాంతంలో శిల్పాశెట్టి తన తొలి బ్రాంచ్‌ను ప్రారంభించారు. ముంబై నగరంలోనే ఈ బాస్టియన్‌ రెస్టారెంట్‌కు మంచి పేరుంది. అయితే, అనూహ్యంగా దీన్ని మూసివేస్తున్నట్లు నిన్న సోషల్‌ మీడియా వేదికగా ప్రకటన చేశారు. అందుకుగల కారణాలను మాత్రం ఆమె వెల్లడించలేదు. దీంతో అందుకు గల కారణాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ‘రెస్టారెంట్‌ను ఎందుకు మూసివేస్తున్నారు..?’ అంటూ సోషల్‌ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై నటి శిల్పా శెట్టి క్లారిటీ ఇచ్చారు. ‘బాస్టియన్‌’ రెస్టారెంట్‌ను మూసేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత తనకు వేల సంఖ్యలో ఫోన్‌కాల్స్‌ వస్తున్నాయని తెలిపారు. దాన్ని పూర్తిగా మూసివేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. తాము ఓ అధ్యాయాన్ని ముగించామని వివరించారు. ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో జుహు ప్రాంతంలో కొత్తగా ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో మంగుళూరు వంటకాలు అందించనున్నట్లు వెల్లడించారు. ఎన్ని బ్రాంచ్‌లు తెరిచినా బాంద్రాలోని రెస్టారెంట్‌ మాత్రమే వాటికి మూల స్థంభం అని పేర్కొన్నారు. ఇది ఎప్పటికీ ప్రత్యేకమేనని దీన్ని పూర్తిగా మూసివేస్తాం అనే ప్రచారంలో ఉన్నది ఉత్తి బోగస్ వార్త అని స్పష్టం చేశారు. అక్టోబర్‌లో దీన్ని జుహులో అందుబాటులోకి తీసుకురానున్నుట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు.

editor

Related Articles