రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టిని విచారించిన పోలీసులు..

రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా శెట్టిని విచారించిన పోలీసులు..

ఓ వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మేరకు మోసం చేసిన కేసులో బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా నిందితులుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి శిల్పా శెట్టిని ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం నిన్న విచారించింది. సోమవారం శిల్పా శెట్టి ఇంటికి వెళ్లిన అధికారులు.. దాదాపు నాలుగున్నర గంటలపాటు ప్రశ్నించినట్లు తెలిసింది. బ్యాంకు లావాదేవీల గురించి ఆరా తీసినట్లు సమాచారం. విచారణ సందర్భంగా శిల్పా శెట్టి నుండి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. విచారణ సందర్భంగా ముంబై పోలీసు ఆర్థిక నేరాల విభాగం శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసినట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. విచారణ సందర్భంగా పలు పత్రాలను నటి అందజేసినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఇదే కేసులో గత నెల రాజ్‌ కుంద్రాను పోలీసులు విచారించిన విషయం తెలిసిందే. దాదాపు 5 గంటల పాటు ఆయన్ని విచారించిన పోలీసులు.. ఆయన వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు.

editor

Related Articles