టిల్లు గాడి ఫస్ట్ లవ్ స్టోరీ..

టిల్లు గాడి ఫస్ట్ లవ్ స్టోరీ..

టాలీవుడ్ హీరో సిద్దు జొన్నలగడ్డ తన నిజ జీవితంలో జ‌రిగిన కొన్ని సంఘ‌ట‌న‌ల‌తోను ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సిద్దు తన ఫస్ట్ లవ్ స్టోరీని పంచుకుంటూ ప్రేక్షకుల మనసులు తాకేలా చేశాడు. ఆయన చెప్పిన వన్ సైడ్ లవ్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియా హాట్ టాపిక్‌గా మారింది. లవ్ అనే ఫీలింగ్‌ని దాటకుండా ఎవరూ ఉండలేరు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒక్కరిపైనా ఆ ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది అంటూ సిద్దు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. నేను కేంద్రీయ విద్యాలయంలో చదువుకునేవాడిని. 7వ తరగతిలోనే ఒక అమ్మాయిపై ప్రేమ కలిగింది. కానీ ఆమెకు నేను ఎప్పుడూ చెప్పలేదు. పదవ తరగతి చివరికి వచ్చినప్పుడు, స్కూల్ చివరి రోజు ఆమె దగ్గరకు శ్లామ్ బుక్‌తో వెళ్లాను. ఆమె తన ల్యాండ్ లైన్ నంబర్ రాసి, ఒక లుక్ ఇచ్చి… సైకిల్‌పై వెళ్లిపోయింది. ఆ సీన్ ఇప్పటికీ క్లియర్‌గా గుర్తుంది అని గుర్తు చేసుకున్నాడు. ఆ తరువాత ఆ అమ్మాయి ఎవరి జీవితంలోకి వెళ్ళిందో, ఎలాంటి ప్రయాణం కొనసాగించిందో తెలియ‌దు. అయితే సిద్దు మాత్రం మళ్లీ ఆమెని కలవలేదట.

editor

Related Articles