నవీన్‌చంద్ర, షాలిని వడ్నికట్టి జంటగా నటిస్తున్న చిత్రం ‘28 డిగ్రీస్ సెల్సియస్’. డా॥ అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. వీరాంజనేయ ప్రొడక్షన్స్ పతాకంపై సాయి అభిషేక్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 4న విడుదల కానుంది. సోమవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇదొక అందమైన ప్రేమకథా చిత్రమని, కథలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని, చివరి 20 నిమిషాలు ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని, ఈ కథలో ఉష్ణోగ్రత అనే అంశం ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుందని దర్శకుడు అనిల్ విశ్వనాథ్ తెలిపారు. ఈ సినిమాలో హీరోయిన్‌ను 28 డిగ్రీల సెల్సియస్‌లోనే ఉంచాలని, అలా లేనిపక్షంలో ఆమెకు ఎలాంటి సమస్యలొస్తాయన్నది కథలో ఆసక్తికరంగా ఉంటుందని నవీన్‌చంద్ర పేర్కొన్నారు. థియేటర్‌లో చూసి ఫీల్ కావాల్సిన చిత్రమిదని, తప్పకుండా అందరికీ నచ్చుతుందని నిర్మాత సాయి అభిషేక్ తెలిపారు. ఈ సినిమాకి శ్రావణ్ భరద్వాజ్ సంగీతాన్నందిస్తున్నారు.
- March 25, 2025
0
203
Less than a minute
Tags:
You can share this post!
editor

