ఓల్డ్ గోల్డ్ వజ్రం ‘షోలే’ మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ధర్మేంద్రకు పద్మ విభూషణ్ ప్రకటించిన సందర్భంగా, భారత సినీ చరిత్రలో మిలీనియం ఆఫ్ ది టాప్ మూవీగా గుర్తింపు పొందిన ఈ చిత్రాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. 1975లో విడుదలైన ఈ క్లాసిక్ సినిమా 50 ఏళ్లైనా తన ప్రభావాన్ని ఏమాత్రం కోల్పోలేదని ఈ ప్రత్యేక ప్రదర్శన మరోసారి నిరూపించింది. దర్శకుడు శివ నాగేశ్వరరావు ఆహ్వానంతో ఈ షోలో పాల్గొనే అవకాశం లభించగా, వై.వి.ఎస్. చౌదరి, దేవి ప్రసాద్ వంటి దర్శకులతో కలిసి థియేటర్‌లో ‘షోలే’ను వీక్షించడం గుర్తుండిపోయే అనుభూతి అయింది. ఈ సందర్భంగా షోలే 50 ఏళ్ల వేడుకగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. రమేష్ సిప్పి దర్శకత్వంలో జిప్పి సిప్పి నిర్మించిన ఈ చిత్రంలో ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, సంజీవ్ కుమార్, హేమమాలిని, జయా బాధురి నటన చిరస్థాయిగా నిలిచింది. గబ్బర్ సింగ్ పాత్రలో అంజాద్ ఖాన్ నటన, ఆర్.డి. బర్మన్ సంగీతం సినిమాను శాశ్వతంగా నిలబెట్టాయి. నిజంగా ‘షోలే’ ఎవర్‌గ్రీన్ మాస్టర్ పీస్.
- January 26, 2026
0
154
Less than a minute
You can share this post!
editor

