సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివశక్తి దత్తా (92) సోమవారం రాత్రి మణికొండలోని తన నివాసంలో కన్నుమూశారు. పలు సినిమాలకు రైటర్‌గా వర్క్ చేసిన ఆయనకి సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయి. శివశక్తి దత్తా మృతిచెందడంతో వారి కుటుంబంతో పాటు అభిమానులు దిగ్భ్రాంతి చెందారు. పలువురు సినీ ప్రముఖులు ఆయన కుటుంబ సభ్యులని పరామర్శిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా శివశక్తి దత్తాకి నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి శివశక్తి దత్తా విశేష సేవలు అందించారంటూ కొనియాడుతున్నారు. శివ శక్తి దత్తా మరణ వార్త తెలుసుకున్న నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలిపారు. ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కీరవాణి గారి తండ్రి, రచయిత, చిత్రకారులు శ్రీ శివశక్తి దత్తా గారు కన్ను మూశారని తెలిసి చింతించాను. శ్రీ దత్తా గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ తన ప్రగాఢ సానుభూతిని వెలిబుచ్చారు. మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో శివశక్తి దత్తా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.
- July 8, 2025
0
42
Less than a minute
Tags:
You can share this post!
editor

