ఆనంది, వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న విమెన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ ‘శివంగి’. దేవరాజ్ భరణి ధరణ్ దర్శకుడు. నరేష్‌బాబు పి. నిర్మాత. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా మార్చి 7న విడుదలకు సిద్ధమౌతోంది. ప్రమోషన్‌లో భాగంగా ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోందని నిర్మాతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. ఒక క్రైమ్‌ని ప్రెజెంట్ చేస్తూ టీజర్ కూడా మొదలైంది. తన జీవితంలో జరిగిన రెండు ముఖ్య విషయాలు ఆనందిని వెంటాడుతుంటాయి. తర్వాత ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నది? అనేది చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. సాంకేతికంగా కూడా సినిమా రిచ్‌గా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. జాన్ విజయ్, డాక్టర్ కోయ కిషోర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: భరణి కె.ధరన్, సంగీతం: ఎహెచ్ కాషిఫ్, ఎబినేజర్ పాల్.

- February 24, 2025
0
21
Less than a minute
Tags:
You can share this post!
editor