‘సంక్రాంతి అల్లుడు’గా  శంకరప్రసాద్‌?

‘సంక్రాంతి అల్లుడు’గా  శంకరప్రసాద్‌?

హీరో చిరంజీవి ప్రస్తుతం అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు ‘సంక్రాంతి అల్లుడు’ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ని పూర్తి చేసుకుంది. సోమవారం నుండి మూడో షెడ్యూల్‌ని కూడా అనిల్‌ రావిపూడి మొదలుపెట్టారు. హైదరాబాద్‌లో మొదలైన ఈ షెడ్యూల్‌లో చిరు, నయనతారలపై కీలక సన్నివేశాలను షూట్‌ చేస్తారట. ఇందులో శంకర్‌ ప్రసాద్‌గా ‘ఘరానా మొగుడు’ నాటి వింటేజ్‌ చిరంజీవిని ఆడియన్స్‌ చూస్తారని, చిరంజీవి మార్క్‌  కామెడీ, మాస్‌ ఎమోషన్స్‌ ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని చిత్రబృందం చెబుతోంది. కేథరిన్‌ థెరిసా, మాస్టర్‌ రేవంత్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, నిర్మాతలు: సాహు గారపాటి, సుస్మిత కొణిదెల.

editor

Related Articles