షారూఖ్ 23 ఏళ్లకే యాక్టర్, హీరో అయ్యారు. నటుడిగా 36 ఏళ్ల ప్రయాణం ఆయనది. దేవుడు అద్భుతమైన జీవితాన్నిచ్చాడు. కోట్లాది మంది ఫ్యాన్స్‌ను ఇచ్చాడు. సంపదను కూడా కావాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చాడు. ఇక నాకు ఒకే ఒక కోరిక ఉంది. లొకేషన్‌లో నటిస్తూ చనిపోవాలి. అదే నా ఆఖరి కోరిక అన్నారు షారుక్. లోకర్నో ఫిల్మ్ ఫెస్టివెల్‌లో భాగంగా ఓ ఇంగ్లీషు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పైవిధంగా స్పందించారు. ఇంకా మాట్లాడుతూ జీవితాంతం నటుడిగానే కొనసాగాలనుకుంటున్నా. ఏదైనా సినిమా సెట్‌లో దర్శకుడు ‘యాక్షన్’ చెప్పగానే నా ప్రాణం పోవాలి. వాళ్లు ‘కట్’ చెప్పాక ఇంక పైకి లేవకూడదు.’ అంటూ నవ్వుతూ చెప్పారు షారుక్. సినీ రంగానికి చేస్తున్న సేవలకు గాను లోకర్నో ఫిల్మ్ ఫెస్టివల్‌లో షారుక్‌కు జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ గౌరవాన్ని సంతోషంగా స్వీకరిస్తున్నానని షారుక్ అన్నారు.

- October 19, 2024
0
33
Less than a minute
Tags:
You can share this post!
administrator