టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచుతున్న విషయం తెలిసిందే. ఆయన తెరకెక్కించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టింది. ఇటీవల కుబేర అనే సినిమాతో పలకరించాడు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇక ఇప్పుడు నానితో ఓ ప్రాజెక్ట్ చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని తన కెరీర్‌ను వైవిధ్యంగా మలుస్తున్నాడు. ప్రేమకథలతో, కుటుంబ డ్రామాలతో ప్రేక్షకుల మనసు దోచిన నాని, ఇటీవల ‘హిట్ 3’ లాంటి డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌తో వైవిధ్యాన్ని చూపించాడు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడనే వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

- August 13, 2025
0
70
Less than a minute
Tags:
You can share this post!
editor