బాలీవుడ్‌లో చిన్న సినిమాగా రిలీజై రికార్డులు సృష్టిస్తున్న సినిమా ‘సైయారా’. ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఈ సినిమా తొలి రెండు రోజుల్లోనే ఏకంగా రూ.45 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద విజయ భేరీ మోగిస్తోంది. సాధారణంగా భారీ బడ్జెట్‌తో, పెద్ద స్టార్లతో తెరకెక్కే సినిమాలు మాత్రమే ఈ స్థాయిలో వసూళ్లను సాధిస్తుంటాయి. అయితే, ‘సైయారా’ సినిమా కంటెంట్ బలంగా ఉంటే చిన్న సినిమాలు కూడా పెద్ద విజయాలను నమోదు చేయగలవని మరోసారి నిరూపించింది. ఆషికి 2, ఏక్ విలన్, ఆవరాపన్, వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్‌లు అందుకున్న దర్శకుడు మోహిత్ సూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. ఈ సినిమాతో ఆహాన్ పాండే, అనిత్ పడ్డా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చారు. లవ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా ఆ నోటా, ఆ నోటా పబ్లిసిటీ అయ్యి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలిరోజే రూ.21 కోట్ల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా రెండో రోజు రూ.24 కోట్లకు ఎగబాకింది. దీంతో చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌కి మంచి హిట్ వచ్చిందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ‘సైయారా’ టీమ్ ఈ అనూహ్య విజయం పట్ల ఉబ్బి తబ్బిబ్బవుతోంది, ఆపై సంతోషం కూడా వ్యక్తపరిచింది.

- July 21, 2025
0
114
Less than a minute
Tags:
You can share this post!
editor