రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో – హీరోయిన్లుగా నటించిన ‘శశివదనే’ సినిమాని సాయి మోహన్ ఉబ్బన దర్శకుడుగా తెరకెక్కించారు. గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ సినిమాను నిర్మించగా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించాడు. ఏడాది క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక అవాంతరాలను దాటుకుని ఎట్టకేలకు రిలీజ్‌కు రెడీ అయింది. ఈ క్రమంలో ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ద్వారా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణను పొందింది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ఈ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌ను గమనిస్తే.. ఇటీవల వచ్చిన కన్యాకుమారి తరహాలోనే అచ్చమైన, స్వచ్చమైన తెలుగు పల్లె ప్రేమకథ అని తెలుస్తోంది.

- September 29, 2025
0
63
Less than a minute
You can share this post!
editor