శరవేగంగా రాజమౌళి సినిమా…

శరవేగంగా రాజమౌళి సినిమా…

మహేష్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటికే రెగ్యులర్‌ షూటింగ్‌ను మొదలుపెట్టిన రాజమౌళి కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించినట్లు తెలిసింది. ఇందుకోసం హైదరాబాద్‌ అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓ సెట్‌ను వేశారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ను ఈ నెలాఖరులో మొదలుపెట్టబోతున్నారని తెలిసింది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ  సినిమాని నాన్‌స్టాప్‌ షెడ్యూళ్లతో శరవేగంగా పూర్తిచేయాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నారట. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంక చోప్రాను ఎంపిక చేశారనే వార్తలు సోషల్‌ మీడియాలో జోరుగా ప్రచారంలో ఉన్నాయి. ఆమె ఇప్పటికే హైదరాబాద్‌కు విచ్చేయడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది.

హీరోయిన్‌గా ప్రియాంక చోప్రా ఎంపిక దాదాపు ఖరారైందని, ఆమె బల్క్‌ డేట్స్‌ కోసం రాజమౌళి ప్రయత్నిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్నందిస్తున్నారు.

editor

Related Articles