‘సార్ మేడ‌మ్’ సినిమా టైటిల్ టీజ‌ర్ విడుద‌ల

‘సార్ మేడ‌మ్’ సినిమా టైటిల్ టీజ‌ర్ విడుద‌ల

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, నటి నిత్యా మీనన్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న తాజా చిత్రం ‘తలైవన్ తలైవి’. ఈ సినిమాకు పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండ‌గా.. టీజీ త్యాగ‌రాజ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌త్య జ్యోతి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై సెంథిల్ త్యాగ‌రాజ‌న్, అర్జున్ త్యాగ‌రాజ‌న్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా ఇప్ప‌టికే త‌మిళంలో టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. అయితే ఈ సినిమాను తెలుగులో సార్‌మేడ‌మ్ పేరుతో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు మేక‌ర్స్. ఈ సంద‌ర్భంగా టైటిల్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు మేక‌ర్స్. ఫుడ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ టీజ‌ర్‌లో విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ మధ్య ఉండే కెమిస్ట్రీని చూపించారు మేక‌ర్స్. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో యోగిబాబు త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

editor

Related Articles