మ్యాడ్, 8 వసంతాలు వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ మరో క్రేజీ ఆఫర్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం ప్రభాస్‌తో కలిసి స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో తృప్తి డిమ్రీ హీరోయిన్‌గా నటించబోతోంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లకముందే ఒక చిన్న సినిమాను సందీప్ నిర్మించబోతున్నాడు. సందీప్ సొంత నిర్మాణ సంస్థ భద్రకాళి పిక్చర్స్‌పై రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా వేణు అనే కొత్త దర్శకుడు టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో 8 వసంతాలు హీరోయిన్ అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.

- September 24, 2025
0
62
Less than a minute
You can share this post!
editor