దేశంలో పలు సమస్యలున్నాయి, వాటిపై స్పందించండి..

దేశంలో పలు సమస్యలున్నాయి, వాటిపై స్పందించండి..

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ భార్య)పై త‌న‌కు క్ర‌ష్ ఉందంటూ బాలీవుడ్ న‌టి స్వరా భాస్కర్ ఆస‌క్తిక‌రమైన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఒక ఇంట‌ర్వ్యూలో భాగంగా స్వరా మాట్లాడుతూ.. మనుషులందరూ సహజంగా బైసెక్సువల్స్‌ అని అందుకే వారికి అబ్బాయిల‌తో పాటు అమ్మాయిల‌పై కూడా ఒక ఇది ఉంటుంద‌ని తెలిపింది. అయితే ఇదే ఇంట‌ర్వ్యూలో అమ్మాయిల‌లో మీ క్ర‌ష్ ఎవ‌రిపై అని అడుగగా.. స్వ‌రా మాట్లాడుతూ.. సమాజ్ వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ (అఖిలేష్ యాదవ్ భార్య)పై తనకు క్రష్ ఉందని ఆమె చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డంతో పాటు స్వరాని నెటిజ‌న్లు ట్రోల్ చేయ‌డం మొద‌లుపెట్టారు. దీంతో ఈ విష‌యంపై త‌న‌దైన శైలిలో స్పందించింది స్వరా.
తాను కేవలం డింపుల్‌ అందాన్ని, హుందాతనాన్ని మాత్ర‌మే అభినందించాన‌ని స్వరా తెలిపింది. ఆమె ఒక రాజకీయ నాయకుడి భార్యగా, రాజకీయవేత్తగా ఎంతో హుందాతనంతో వ్యవహరించారని, ఆమె నుండి చాలా నేర్చుకోవచ్చని ఇంట‌ర్వ్యూలో చెప్పిన‌ట్లు రాసుకొచ్చింది. అయితే నెటిజ‌న్లు తన వ్యాఖ్యలపై త‌ప్పులు వెతికే బ‌దులు దేశంలో జరుగుతున్న ముఖ్యమైన విష‌యాల‌లో ఒక‌టైన‌ ‘ఓట్ల చోరి’ వంటి సమస్యలపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

editor

Related Articles