తిరుమల స్వామి వారిని దర్శించుకున్న  సమంత

తిరుమల స్వామి వారిని దర్శించుకున్న  సమంత

టాలీవుడ్ హీరోయిన్ స‌మంత నిర్మాణంలో రాబోతున్న తాజా సినిమా ‘శుభం’. ‘చచ్చినా చూడాల్సిందే’ అనేది క్యాప్షన్. ఈ సినిమాకు ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్‌ కాండ్రేగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. హర్షిత్‌రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ తదిత‌రులు ఇందులో ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మే 9న ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ సంద‌ర్భంగా వ‌రుస ప్ర‌మోష‌న్స్ చేస్తోంది చిత్ర‌బృందం. ట్రాలాలా బ్యానర్‌పై నిర్మాతగా సామ్ ఫ‌స్ట్ సినిమా కావ‌డంతో భారీ అంచ‌నాలున్నాయి. ఈ సినిమా విజ‌యం సాధించాల‌ని తాజాగా సామ్‌తో పాటు సినిమా యూనిట్ అంతా క‌లిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం ఉద‌యం తిరుమ‌ల‌కు చేరుకున్న సామ్‌తో పాటు శుభం సినిమా బృందానికి టీటీడీ ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. సామ్ క్రిస్టియ‌న్ కావ‌డంతో ద‌ర్శ‌నంకి ముందు టీటీడీ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసిన తర్వాత స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుంది. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి శాలువాతో సత్కరించారు. స్వామి వారి తీర్థప్రసాదాలు, చిత్రపటం సమంతకు అందజేశారు.

editor

Related Articles