టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాయ చేశావే సినిమాతో వెండి తెరకు పరిచయమైన సమంత తన తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతే కాకుండా జెస్సీగా తన నటనతో యూత్ ఫేవరెట్‌గా కూడా మారింది. ఈ సినిమా తర్వాత సామ్‌కు వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ రావడం, వచ్చిన ప్రతి సినిమాతో మంచి సక్సెస్ అందుకోవడంతో అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా మారింది. సమంత హీరోల సినిమాల్లో నటించడమే కాకుండా యాక్షన్ సినిమాలు, లేడీ ఓరీయెంటెడ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. అడపాదడపా వెబ్ సిరీస్‌లలో కూడా నటిస్తూ సత్తా చాటుతోంది. గత కొంతకాలంగా సమంత-రాజ్ నిడిమోరు జంట ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్య రాజ్‌తో సమంత సన్నిహితంగా కనిపించడం, తిరుమల, శ్రీకాళహస్తి ఆలయాలకు కలసి వెళ్లడం, ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్‌లో కలిసి హాజరవడం చూసి ఇద్దరి మధ్య స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడిందనే అభిప్రాయం ఫ్యాన్స్‌లో కలుగుతోంది. ఇటీవల అయితే సమంత భుజంపై అతను చేయి వేసి నడవగా, మరో ఫొటోలో ఇద్దరు పక్కపక్కన కూర్చొని చాలా హ్యాపీ మూడ్‌లో కనిపించారు. కట్ చేస్తే ఈ జంట ఒకే కారులో కనిపించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఇక ఇది చూసిన తర్వాత కొందరు త్వరలోనే వారి రెండో పెళ్లి అంటూ జోస్యాలు చెబుతున్నారు.

- July 31, 2025
0
35
Less than a minute
Tags:
You can share this post!
editor