సమంత ప్రస్తుతం రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లారు. కాస్త విశ్రాంతి తర్వాత మళ్లీ సెట్‌లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. తన తదుపరి సినిమా అప్‌డేట్ ఇచ్చారు. ‘శుభం’ చిత్రంతో మాయ మాతశ్రీగా కామియో చేసి మెప్పించారు సమంత. ఆ సినిమాకి నిర్మాతగానూ వ్యవహరించి విజయం సాధించారు. ఈ సినిమా సక్సెస్‌తో తన సొంత బ్యానర్ ట్రాలాలా మువింగ్ పిక్చర్స్‌లో వరుసగా కథా బలమైన సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ దిశగా కథలు వింటూ బిజీగా ఉన్న సమంత ప్రస్తుతం రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లారు. ఆమె తనకెంతో ఇష్టమైన ఈషా ఫౌండేషన్‌కు వెళ్తున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు. ‘మళ్లీ ఆ సమయం వచ్చింది, ప్రతి మూడు నెలలకు ఓసారి నేను నిశ్శబ్ధంలోకి వెళ్తాను. ఇలా కొన్నేళ్లుగా జరుగుతోంది. నాకు పవిత్రమైన స్థలమిది. ఈ ఆనంద నిలయం నాకు రెండో ఇల్లు లాంటిది. కష్టంలో, ఎత్తుపల్లాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఊరట కలిగించింది. ఇదే నాకు ఆనంద నిలయం’ అని సమంత ఈషా ఫౌండేషన్ గురించి చెప్పుకొచ్చారు.

- October 6, 2025
0
45
Less than a minute
You can share this post!
editor