జాతీయ అవార్డు గ్రహీత వెట్రిమారన్ దర్శకత్వంలో శింబు హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్నట్లు చాలాకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తూ మంగళవారం మేకర్స్ అధికారికంగా ప్రకటన రిలీజ్‌చేసి ఈ సినిమాకు ఆరసన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలిపారు. శింబు 49వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కళైపులి థాను తమ వి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందించనున్నాడు.
అయితే ఈ సినిమాలో శింబు సరసన సౌత్ హీరోయిన్ సమంత ఎంపికైనట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీం సమంతను సైతం సంప్రదించినట్లు, ఇంకా చర్చలు నడుస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది. అయితే.. సమంతతో పాటు కీర్తి సురేష్, శ్రీలీలను సైతం ఈ సినిమా కోసం సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
