అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్లిన సాయి ధ‌ర‌మ్ తేజ్

అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్లిన సాయి ధ‌ర‌మ్ తేజ్

టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కేర‌ళ తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామిని ద‌ర్శించుకున్నాడు. గురువారం ఉద‌యం త‌న స్నేహితుల‌తో క‌లిసి ఆల‌యానికి వెళ్లిన సాయి ధరమ్ తేజ్‌కి ఆల‌య అధికారులు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికి ద‌ర్శ‌న ఏర్పాట్లు చేశారు. ఇక‌ అనంతశయన రూపంలో కొలువై ఉన్న స్వామివారిని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు చేశాడు సాయి ధరమ్ తేజ్. అనంత‌రం వేద‌పండితులు అత‌డికి తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌ అయ్యాయి.

editor

Related Articles