ఈ సీజన్‌లో కన్నడ భామల హవా స్పష్టంగా కనిపిస్తోంది. రష్మిక మందన్న బ్లాక్‌బస్టర్లతో దూసుకుపోతుంటే, నభా నటేష్, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి యాక్ట్రెస్‌లు కాస్త వెనకబడ్డారు. ఇక ఈ పోటీలో మరో కన్నడ బ్యూటీ రుక్మిణీ వసంత్ చేరింది. 2019లో ‘బీర్బల్’ సినిమాతో కన్నడలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన రుక్మిణికి నిజమైన గుర్తింపు మాత్రం 2023లో వచ్చిన క్లాసిక్ లవ్‌స్టోరి ‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో వచ్చింది. ఇందులో ఆమె నటన, ఎమోషనల్ ఫీలింగ్స్ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమా నాకు సెకండ్ లైఫ్ అనే చెప్పాలి. ఒక దశలో నటిగా నేను సెట్ అవుతానా లేదా అనే డైలమాలో ఉన్నాను. కానీ సప్త సాగరాలు దాటి సినిమా వల్ల నా జీవితం మారిపోయింది, అని ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. రుక్మిణీ వసంత్ తెలుగులో నిఖిల్ సరసన నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద చెప్పుకో తగ్గ ఫలితాన్ని సాధించలేదు. అయినప్పటికీ, రుక్మిణికి అవకాశాలు మాత్రం తగ్గలేదు. ఈ బ్యూటీ ఇప్పుడు ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీయాక్షన్ సినిమా ‘డ్రాగన్’ లో హీరోయిన్‌గా నటిస్తోంది.

- September 1, 2025
0
50
Less than a minute
Tags:
You can share this post!
editor