హీరో హృతిక్ రోషన్, మరో హీరో ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా సినిమా వార్ 2. యష్‌రాజ్ బ్యానర్‌పై అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా నుండి వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్‌ను విడుదల చేసిన చిత్ర యూనిట్ తాజాగా ‘ఊపిరి ఊయలగా’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని ఈ రోజు రిలీజ్ చేశారు. హృతిక్, కియారాల మధ్య వచ్చే ఈ సాంగ్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. తెలుగు పాటకు చంద్రబోస్ లిరిక్స్ అందించగా.. పాడినవారు శశ్వాంత్ సింగ్.

- July 31, 2025
0
87
Less than a minute
Tags:
You can share this post!
editor