Movie Muzz

ఏం దాచారు ఈ పోస్టర్‌లో? ‘ఆర్.కె దీక్ష’ ఫస్ట్ లుక్

ఏం దాచారు ఈ పోస్టర్‌లో? ‘ఆర్.కె దీక్ష’ ఫస్ట్ లుక్

ఆర్ కె ఫిల్మ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మించిన ‘ఆర్.కె దీక్ష’ సినిమా కొత్త పోస్టర్ విడుదల అయ్యింది. డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ నిర్మాణంలో, బిఎస్ రెడ్డి సమర్పణలో, కిరణ్ హీరోగా, అక్సా ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కింది. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ కీలక పాత్రలు పోషించారు. రాజ్ కిరణ్ సంగీతం అందించగా, మేఘన శ్రీను ఎడిటర్‌గా పనిచేశారు.

పోస్టర్ రిలీజ్ కార్యక్రమంలో తెలుగు చిత్ర నిర్మాత మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్నకుమార్, నిర్మాతలు, నటీనటులు పాల్గొన్నారు. దర్శకుడు రామకృష్ణ గౌడ్ చిన్న నిర్మాతలకు డిజిటల్ ఛార్జెస్ పై తన సందేశాన్ని షేర్ చేశారు. ఆయన మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారి టైటిల్ ‘దీక్ష’ మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా ఉంది, చిన్న నిర్మాతలు బ్రతకాలి, సినిమా పరిశ్రమలో నిలబడాలి అని హైలైట్ చేశారు. ఈ సినిమాకు మంచి విజయం రావాలని కోరారు.

editor

Related Articles