టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. వర్మపై నమోదైన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. సినిమా పోస్టర్లపై అనకాపల్లి, తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లలో వర్మ మీద కేసులు నమోదు కాగా.. తాజాగా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మద్దిపాడు పీఎస్‌లో నమోదైన కేసులో ఏపీ పోలీసులు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడు. ఇటీవలే ఈ కేసులో రాంగోపాల్ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన కోర్టు… ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
- December 10, 2024
0
271
Less than a minute
Tags:
You can share this post!
administrator

