2026 సంక్రాంతికి రవితేజ మాస్ ట్రీట్..?

2026 సంక్రాంతికి రవితేజ మాస్ ట్రీట్..?

ప్రస్తుతం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో రవితేజ నటిస్తోన్న సినిమా ఆర్‌టి76. అమిగోస్‌ ఫేం ఆషికా రంగనాథ్ ఫిమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.
ఆర్‌టి76 రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులకు ఫుల్‌ మీల్స్‌ లాంటి పసందైన వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. ఇప్పటికే విడుదలైన మాస్‌ జాతర బాక్సాఫీస్‌ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇటీవలే స్పెయిన్‌లో షూటింగ్ కొనసాగుతున్నట్టు తెలియజేస్తూ రవితేజ టీం రిలీజ్ చేసిన స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్పెయిన్‌లో సాంగ్‌ షూట్‌ పూర్తి చేసినట్టు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది రవితేజ టీం. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఖిలాడి ఫేం డింపుల్ హయతి కూడా నటిస్తోంది. ఈ సాంగ్ షూట్‌ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. సుధాకర్ చెరుకూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

editor

Related Articles