రవితేజ ప్రస్తుతం భాను భోగవరపు డైరెక్షన్‌లో ‘మాస్ జాతర’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర సందడి చేసేందుకు రవితేజ ప్లాన్ చేస్తున్నట్లు సినీ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు కిషోర్ తిరుమల రవితేజ కోసం ఓ కథను రెడీ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ కథను రవితేజకు ఆయన వినిపించాడని.. రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే, రవితేజ లాంటి మాస్ హీరో కోసం కిషోర్ తిరుమల ఎలాంటి కథను రెడీ చేశాడా అనేది ఆసక్తికరంగా మారింది. కాగా ఈ సినిమాను 2026 సంక్రాంతి బరిలో రిలీజ్ చేసే విధంగా పక్కా ప్రణాళిక కూడా రెడీ చేస్తున్నారట. ఇక ఈ సినిమా గురించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తోంది. ఈ సినిమాను ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేయనున్నారట.

- March 4, 2025
0
15
Less than a minute
Tags:
You can share this post!
editor