‘మాస్ జాతర’ టైటిల్ పెట్టిన‌ ర‌వితేజ‌..

‘మాస్ జాతర’ టైటిల్ పెట్టిన‌ ర‌వితేజ‌..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక సినిమాకి హైప్ క్రియేట్ చేసే టైటిల్ పెట్ట‌డం చాలా ముఖ్యం. అయితే తాజాగా మాస్ మహారాజా రవితేజ తన కొత్త సినిమా ‘మాస్ జాతర’కి స్వయంగా టైటిల్‌ను పెట్టి ఆ టైటిల్‌ను ఫైనల్ చేయించిన‌ట్టు చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్న భాను భోగవరపు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మొదటిసారి కథ వినగానే రవితేజ సినిమా పట్ల ఎంతో ఉత్సాహం చూపించాడని చెప్పారు. కథలో మాస్ అంశాలు, పాత్ర పవర్‌ఫుల్‌గా ఉండటంతో వెంటనే “మాస్ జాతర” అనే టైటిల్‌ను రవితేజనే సూచించాడట. దర్శకుడికి కూడా టైటిల్ బాగా నచ్చడంతో ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశారట. ఇక సినిమా టైటిల్‌కు పెట్టిన “మనదే ఇదంతా” అనే క్యాప్షన్ మాత్రం దర్శకుడు భాను క్రియేటివిటీ పెట్టాడ‌ట‌. మొదట ఈ క్యాప్షన్‌ను రవితేజ తిరస్కరించాడట. అయితే భాను “ఒక్కసారి వేసి చూద్దాం, నచ్చకపోతే తీసేస్తాం” అని చెప్పడంతో రవితేజ అంగీకరించాడట. చివరికి ఆ క్యాప్షన్‌కి కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని దర్శకుడు తెలిపాడు.

editor

Related Articles