Movie Muzz

భర్త మహాశయులకు విజ్ఞప్తి 7నా..?

భర్త మహాశయులకు విజ్ఞప్తి 7నా..?

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం సినిమాకు అదనపు హైప్‌ను తీసుకొచ్చింది. తాజాగా మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జనవరి 7న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీని పెంచింది. రవితేజ ఎనర్జీ, టైమింగ్‌కు కిశోర్ తిరుమల క్లాస్ టచ్ కలిసితే ఎలా ఉంటుందో ఈ సినిమా అలాగే ఉండనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతి మధ్య రవితేజ ఇరుక్కునే లవ్ ట్రయాంగిల్ సన్నివేశాలు కామెడీకి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. భీమ్స్ సంగీతంలో రూపొందిన ‘వామ్మో వాయ్యో’ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. భోగి కానుకగా జనవరి 13న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం పక్కా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే క్లీన్ ఎంటర్టైనర్‌గా రూపొందింది.

Related Articles