పాపం ర‌ష్మిక అలా బుక్ అయిందేంటి.

పాపం ర‌ష్మిక అలా బుక్ అయిందేంటి.

ఇటీవల ఆమె తన ప్రియుడు విజయ్ దేవరకొండతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్‌గా మారగా, రెండు రోజులకే విజయ్ దేవరకొండ కార్ యాక్సిడెంట్‌కు లోనయ్యాడని వార్తలు రావడంతో రష్మికపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అయితే రష్మికపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మ‌రింత ఎక్కువైంది. కర్ణాటకలో పుట్టిపెరిగిన రష్మిక ‘కిరిక్ పార్టీ’తో కెరీర్ ప్రారంభించి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. సాధారణంగా నటులు తమ స్వస్థ‌లం, భాష, ప్రాంతాన్ని గౌరవంగా భావిస్తారు, కానీ రష్మిక తన కన్నడ మూలాల‌కి ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు అని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవల వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’ పాన్ ఇండియా హిట్ సినిమాపై రష్మిక ఎలాంటి కామెంట్ చేయ‌క‌పోవ‌డం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నెటిజన్లు కొంతమంది “నీకు బతుకునిచ్చిన కన్నడ ఇండస్ట్రీని మర్చిపోతున్నావ్, స్టార్‌డమ్ తగ్గిన తర్వాత నీకు సాయపడేది, ఆదరించేది స్వస్థలం మాత్రమే” వంటి కామెంట్లు పెడుతున్నారు. అయితే, రష్మికపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కొంతమంది అండగా నిలిచారు. సినిమా హిట్ అయిన వెంటనే ప్రతి ఒక్కరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని ఏమీ రూల్ లేదు క‌దా అని అంటూ ఆమెకి సపోర్ట్‌గా నిలుస్తున్నారు. నిజానికి, రష్మిక ‘కాంతార చాప్టర్ 1’పై ట్వీట్ చేయకపోవడానికి వ్యక్తిగత కారణాలున్నాయని అభిమానులు చెబుతున్నారు. రష్మిక మొదటి సినిమా ‘కిరిక్ పార్టీ’ కాగా, ఈ సినిమాకి దర్శకుడు రిషబ్ శెట్టి, హీరోగా న‌టించిన‌ రక్షిత్ శెట్టి ప్రాణ స్నేహితులు. రష్మిక – రక్షిత్ ఎంగేజ్‌మెంట్ రద్దైన తర్వాత, ఆమె కన్నడ ఇండస్ట్రీకి కొంత దూరంగా ఉంటూ తెలుగు, హిందీ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టింది. ‘కాంతార చాప్టర్ 1’లో రిషబ్ శెట్టి నటించినందున, ఆమె వ్యక్తిగత కారణాల వ‌ల్ల ఈ సినిమాపై స్పందించ‌లేద‌ని సమాచారం.

editor

Related Articles