రష్మిక మందన్నా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి తమ హర్రర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ఆదిత్య సర్పోట్‌దర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆయుష్మాన్ ఖురానా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షూటింగ్ అప్‌డేట్ షేర్ చేసింది. ‘మరో రెండు రోజులు రాత్రిపూట షూటింగ్ ఉండబోతుంది.. కాబట్టి నేను పెట్టే పోస్టులు, స్టోరీలు కేవలం చంద్రుడి వెలుగులో, కెమెరా లైట్స్ మధ్య కానీ, నక్షత్రాల మధ్య నుండి ఉండవచ్చు. (మన సిటీలో చూసేందుకు వీలుకానిది) ఒప్పుకుంటారా..?’ అంటూ చంద్రుడి వెన్నెలలో తీసిన స్టిల్‌ను షేర్ చేసింది రష్మిక మందన్నా. అయితే లొకేషన్ ఎక్కడనేది సస్పెన్స్. ఇప్పుడీ స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది.

- April 10, 2025
0
9
Less than a minute
Tags:
You can share this post!
editor