నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్లో నటిస్తున్న ఫీమేల్-సెంట్రిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మైసా’ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో, అన్‌ఫార్ములా ఫిల్మ్స్ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్ మైసా పాత్ర డార్క్, ఇంటెన్స్ ప్రపంచాన్ని ప్రదర్శిస్తుంది. రష్మిక ఈ పాత్ర కోసం చేసిన షాకింగ్ ట్రాన్స్ఫర్మేషన్, రఫ్ లుక్, ఫైర్‌లా కనిపించే ఆగ్రహం, ఆవేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మైసా పాత్రలో గోండ్ తెగకు చెందిన శక్తివంతమైన మహిళ చూపిన విధానం ఇండియన్ సినిమాల్లో అరుదైన ప్రయత్నంగా నిలుస్తోంది. ఈ సినిమాలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రేయాస్ పి కృష్ణ విజువల్స్, జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఆండీ లాంగ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు మరింత బలం చేకూరుస్తున్నాయి. టీజర్ విడుదలతో మైసా పై బజ్ భారీగా పెరిగింది. రష్మిక కెరీర్లో ఇది మైల్స్టోన్ మూవీగా నిలవనుంది.
- December 24, 2025
0
5
Less than a minute
You can share this post!
editor


