బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ప్రేక్షకులకి ఎంత మంచి వినోదం అందిస్తోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడీయన్స్ లైమ్ లైట్‌లోకి వచ్చారు. కొంతమంది సినిమాల్లోకి వెళ్లి కూడా సత్తా చాటుతున్నారు. అయితే జబర్దస్త్ షో అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో అనసూయ, రష్మీ తప్పక ఉంటారు. ఒకప్పుడు ఈ ఇద్దరూ జబర్దస్త్‌కు యాంకర్లుగా నిలిచారు. అయితే అనసూయ సినిమాలపై ఫోకస్ పెంచడంతో షో నుండి తప్పుకోగా, రష్మీ మాత్రం ఇప్పటికీ యాంకర్‌గా అలా ఉండిపోయింది. జబర్దస్త్ కామెడీ షో 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గ్రాండ్ సెలబ్రేషన్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఈ వేడుకకు పాత జబర్దస్త్ టీమ్ మొత్తాన్ని ఆహ్వానించగా అనసూయ కూడా హాజరైంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అనసూయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రోమోలో అనసూయ మాట్లాడుతూ, “జీవితం బోలెడన్ని అవకాశాలు ఇవ్వదని అంటారు కానీ తప్పకుండా ఇస్తుందిని అవి సరైన టైములో మనం వాడుకోగలిగితేనే పైకి ఎదుతామని భావోద్వేగంతో చెప్పింది. అంతేకాదు, రష్మీ దగ్గరకు వెళ్లి హత్తుకోవడంతో ఆమె కంటతడి పెట్టుకుంది. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా మానవ సంబంధాలు సరిగా లేవని అర్థమవుతోంది. విభేదాల కారణంగా మాట్లాడుకోవడం లేదా, లేక పనుల ఒత్తిడితో ఈ గ్యాప్ వచ్చిందా అన్నది పూర్తి ఎపిసోడ్‌లో తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌ను ఆగస్ట్ 8, 9 తేదీల్లో రాత్రి 9:30 కి ఈటీవీలో ప్రసారం చేయనున్నారు. అందుకే జబర్దస్త్ ఫ్యాన్స్ ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఎపిసోడ్‌కి నాగబాబు హాజరు కావడం ప్రత్యేక ఆకర్షణ.

- August 6, 2025
0
52
Less than a minute
Tags:
You can share this post!
editor